బీజేపీ మోసంపైనే ప్రస్తుతం పోరాటం : ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు

  • చంద్రబాబు ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది
  • టీడీపీలాగే ఎన్టీయేలోని చాలా పక్షాల్లో అసంతృప్తి ఉంది
  • ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై ఎన్నికల వేళ ఆలోచిస్తాం
‘విభజన కష్టాల నుంచి గట్టెక్కుదామనే బీజేపీతో జత కలిశాం, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది, ఆ మోసంపైనే ప్రస్తుతం టీడీపీ పోరాడుతోంది’ అని ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన అమరావతిలో మాట్లాడారు.

బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని చెప్పారు. బీజేపీయేతర పక్షాలే కాదు ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు కూడా కొన్ని మోదీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. మోదీ విధానాలను వ్యతిరేకించే అన్ని పక్షాలను ఏకతాటి మీదికి తేవడమే టీడీపీ ప్రయత్నమని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు అనేది అప్రస్తుతమని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని తేల్చిచెప్పారు.
Go Back to Shorts
kalavenktrao
ap Telugudesam

More Telugu News