సెట్లో డ్యాన్సర్ హఠాన్మరణం... ఉదారత చూపిన హీరో అజిత్!
- ప్రస్తుతం 'విశ్వాసం' సినిమాలో నటిస్తున్న అజిత్
- పుణెలో పాట చిత్రీకరిస్తుండగా ఘటన
- సొంత ఖర్చుతో మృతదేహం తరలింపు
- డ్యాన్సర్ కుటుంబానికి రూ. 8 లక్షల సాయం
గుండెపోటు వచ్చిన ఆయన, సెట్ లోనే కుప్పకూలగా, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు మిగల్లేదు. ఈ ఘటనను దగ్గరుండి చూసిన అజిత్, తన సొంత ఖర్చులతో మృతదేహాన్ని విమానంలో చెన్నైకి చేరేలా ఏర్పాట్లు చేశారట. ఆపై అతని కుటుంబానికి అండగా నిలుస్తానని చెబుతూ, తన వంతుగా రూ. 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, తనలోని ఉదారతను చాటుకున్నాడు అజిత్.