Warangal Rural District: వరంగల్ లో ఈసీ కలకలం.. కాంగ్రెస్ ఆఫీసు తాళాలు పగులగొట్టి తనిఖీలు!

  • పార్టీ నేతలకు సమాచారమివ్వని అధికారులు
  • ఆందోళనకు దిగి, ర్యాలీ నిర్వహించిన నేతలు
  • ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారి సతీశ్ నిర్బంధం
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ రోజు కలకలం చెలరేగింది. జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తాళాలను ఈ రోజు ఉదయాన్నే పగులగొట్టిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ నేతలకు కనీస సమాచారం ఇచ్చేందుకు ఏమాత్రం యత్నించలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు ఫ్లయింగ్ స్వ్కాడ్ చీఫ్ సతీశ్ ను నిర్బంధించారు. అలాగే అధికారుల తీరును నిరసిస్తూ నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఈ దాడి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతీకార చర్యలు సరికాదని హెచ్చరించారు. అధికార టీఆర్ఎస్ నేతలే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Warangal Rural District
election commission
flying squad
raids
Congress
party office

More Telugu News