jagapathibabu: వారసులుగా వచ్చిన వాళ్లంతా సక్సెస్ అవుతారని లేదు: జగపతిబాబు

  • నా ఎంట్రీ వరకే నాన్న ఉపయోగపడ్డారు 
  • నేను బలవంతంగా రుద్దబడిన హీరోను కాదు
  • ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లే నిలబడతారు
హీరోగా .. విలన్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా జగపతిబాబు ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఇండస్ట్రీలో ఆయనకి ముక్కుసూటి మనిషి అనే పేరు వుంది. అలాంటి జగపతిబాబు తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.

"వారసత్వమనేది రాజకీయాల్లోనే కాదు .. ఇండస్ట్రీలోను ఉందనే సంగతి తెలిసిందే. వారసులను తెచ్చేసి తమపై బలవంతంగా రుద్దేస్తున్నారనే భావన ఆడియన్స్ లో వుంది. ఒక ప్రముఖ నిర్మాత తనయుడిగానే మీరు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మీ గురించి అప్పట్లో ఇలాంటి కామెంట్స్ వచ్చాయా?"  అనే ప్రశ్న జగపతిబాబుకి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఇంట్రడక్షన్ వరకే నాకు మా నాన్న ఉపయోగపడ్డారు. ఎంట్రీ ఈజీగా వుంటుందనే తప్ప .. టాలెంట్ వున్న వాళ్లే నిలదొక్కుకుంటారు. వారసులుగా వచ్చి ఫెయిలైన వాళ్లు కూడా ఉన్నారుగా. వారసులుగా వచ్చిన వాళ్లంతా సక్సెస్ అవ్వాలనే రూలేం లేదు. నేను ఆడియన్స్ పై బలవంతగా రుద్దబడిన హీరోను కాదు .. నా విషయంలో అది వర్తించదు" అని ఆయన చెప్పుకొచ్చారు.   
jagapathibabu
tnr

More Telugu News