తెలంగాణ ఎన్నికలు... ఎమ్మెల్యే బరిలో మాజీ ఎంపీలు... టికెట్ ఖరారు చేసుకున్న నేతలు!
- మెదక్ నుంచి విజయశాంతి
- కరీంనగర్ నుంచి పొన్నం, కంటోన్మెంట్ నుంచి సర్వే
- మాజీ ఎంపీల అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన కాంగ్రెస్?
వీరిలో కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, మెదక్ నుంచి విజయశాంతి, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరితో పాటు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జడ్చర్ల నుంచి మల్లు రవి, కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ కూడా తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో వీరి పేర్లు ఖరారైనట్టు సమాచారం.