శోభన్ బాబును ఒప్పించడం చాలా కష్టమైపోయింది: పరుచూరి గోపాలకృష్ణ
- శోభన్ బాబుతో 'సర్పయాగం' చేశాను
- గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు
- తెల్ల గెడ్డంతో కనిపించనన్నారు
'సర్పయాగం' సినిమా క్లైమాక్స్ లో ఆయన కొంచెం నెరిసిన గెడ్డంతో కనిపించాల్సి ఉంటుంది .. అందుకు ఆయన ఒప్పుకోలేదు. 'నేను లేడీస్ ఇష్టపడే హీరోని ... తెల్ల గెడ్డంతో కనిపిస్తే బాగుండదు' అన్నారు. 'ప్లీజ్ అండీ .. కూతురు చనిపోయింది .. ఓ తండ్రిగా మీరు బాధలో వున్నారు .. ఆ బాధలో కోర్టులో మాట్లాడుతున్నారు .. ఆడియన్స్ వైపు నుంచి మీ పాత్రకి సానుభూతి కావాలి' అని చెప్పాను. అప్పుడు ఆయన 'ఓకే' అన్నారు. నిజంగా ఈ విషయంలో ఆయనను ఒప్పించడానికి అటు సూర్యుడు ఇటు పొడిచాడు' అంటూ నవ్వేశారు.