YSRCP: వైకాపా కార్యకర్తలకు, ప్రజలకు జగన్ ట్విట్టర్ మెసేజ్!

  • ఏడాది క్రితం మొదలైన యాత్ర
  • గాయం నుంచి కోలుకుంటున్నా
  • అతి త్వరలో తిరిగి పాదయాత్ర
ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న లక్ష్యంతో సరిగ్గా ఏడాది క్రితం తాను ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్రను గుర్తు చేసుకుంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్, ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ పెట్టారు.

"గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన" అని ఆయన అన్నారు.

మరో ట్వీట్ లో "ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన రెండు ట్వీట్లూ వైరల్ అవుతున్నాయి.
YSRCP
Jagan
Twitter

More Telugu News