జగన్ పాదయాత్రపై తొలిసారి స్పందించిన పవన్ కల్యాణ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేత అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లపై తిరుగుతుంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మట్టి తవ్వకాలపై జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

కాగా, జగన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాసంకల్ప యాత్ర’ మరో నెలరోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ఆయన పాదయాత్ర ‘కత్తి దాడి’ కారణంగా వాయిదా పడింది. గాయం పూర్తిగా మానిన అనంతరం ఆగిన చోట నుంచే జగన్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.


More Telugu News