తెలుగుదేశంతో కలిసిన కారణమిదే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ కుటుంబ పాలన
- రాష్ట్రాన్ని రక్షించేందుకే టీడీపీతో పొత్తు
- హామీలను విస్మరించిన కేసీఆర్
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
గత నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను మభ్యపెట్టడం మినహా కేసీఆర్ మరేమీ చేయలేదని వ్యాఖ్యానించిన ఆయన, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారని అన్నారు. అన్ని గ్రామాలకూ నీరు ఇవ్వకుండా ఓట్లను అడగబోనని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం జరుగకుండా చూడటం, ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయడమే లక్ష్యంగా మహా కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు.