జగన్ పై దాడి ఫలితం... వైజాగ్ ఎయిర్ పోర్ట్ సీఎస్ఓ బదిలీ!
- ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి
- చెన్నైకి బదిలీ అయిన సీఎస్ఓ వేణుగోపాల్
- వేణుగోపాల్ ను ప్రశ్నించిన ఏఏఐ
జగన్ పై హత్యాయత్నం అనంతరం, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన ఏఏఐ అధికారులు, ఘటన తరువాత జగన్ పక్కనే ఆయన ఉండకుండా, శ్రీనివాసరావు వెంట ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని ప్రశ్నించినట్టు తెలిసింది. జగన్ రెండు నెలలుగా ఎయిర్ పోర్టుకు వస్తుండగా, మొదట్లో స్థానిక నేత జియ్యాని శ్రీధర్ ఇంట్లో నుంచి కాఫీ వచ్చేది. ఘటనకు రెండు వారాల క్రితం, సీఎస్ఓ వేణుగోపాల్, కాఫీ తెచ్చేందుకు అనుమతించలేదు. ఉద్దేశపూర్వకంగానే కాఫీని అడ్డుకున్నారా? అన్న అనుమానాలపైనా ఏఏఐ ఆయన్ను ప్రశ్నించినట్టు సమాచారం.