urvasi rautela: తెలుగు సినిమాలో ఐటమ్ గాళ్ గా ఊర్వశి రౌతేలా?

  • బాలీవుడ్లో భారీ ప్రాజెక్టులు 
  • యూత్ లో పెరుగుతోన్న క్రేజ్
  • తెలుగు నుంచి అవకాశాలు    
బాలీవుడ్ తెరకి కొత్త అందాన్ని తీసుకొచ్చిన సుందరి ఊర్వశి రౌతేలా అనేది కుర్రకారు మాట. హిందీలో ఒక్కో సినిమా చేస్తూ .. ఒక్కో మెట్టూ పైకెక్కుతూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 'హేట్ స్టోరీ 4' తో అందరి దృష్టిని ఆమె తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత వచ్చే అవకాశాలు అంతకి మించి తన స్థాయిని పెంచేలా ఉండాలనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి కూడా ఈ సుందరికి అవకాశాలు వెళుతున్నాయట .. అదీ ఐటమ్ సాంగ్ కోసం. తెలుగులో ఒక స్టార్ హీరో చేసే భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని ఆమెను సంప్రదించారట. అందుకు ఆమె అంగీకరించిందనీ .. పారితోషికంగా ఆమెకి భారీ మొత్తం ముట్టనుందని చెప్పుకుంటున్నారు. ఇక ఏ స్టార్ హీరో చేసే సినిమాలో ఆమె మెరవనుందనేది త్వరలోనే తెలిసే అవకాశాలు వున్నాయి. మొత్తానికి ఊర్వశి రౌతేలా తెలుగు తెరపైకి వచ్చేస్తుందన్న మాట.   
urvasi rautela

More Telugu News