jagan: జగన్ ను పరామర్శించిన మోహన్ బాబు

  • జగన్ త్వరగా కోలుకోవాలి
  • ఆయన నిండు నూరేళ్లు బతుకుతారు
  • రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు
విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్... హైదరాబాదులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు.

 జగన్ నివాసానికి వెళ్లిన మోహన్ బాబు... ఘటన వివరాలను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని... ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. జగన్ నిండు నూరేళ్లు బతుకుతారని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు.
jagan
mohan babu

More Telugu News