mulayam singh yadav: అయోధ్య భూ వివాదంపై స్పందించిన ములాయం కోడలు!

  • అయోధ్య రామాలయ నిర్మాణానికి సంపూర్ణ మద్దతు 
  • సుప్రీంకోర్టుపై పూర్తి విశ్వాసం ఉంది
  • అందరూ ఎదురుచూడాల్సిందే
అయోధ్య భూ వివాదం కేసును జనవరికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ స్పందించారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందేనని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసును జనవరిలో విచారిస్తామని సుప్రీం చెప్పడంతో అందరూ వేచి చూడాల్సిందేనన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నానని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. 
mulayam singh yadav
aparna yadava
ayodhya

More Telugu News