KTR: కేటీఆర్ చొరవతో శాంతించిన ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని హామీ

  • కల్వకుర్తి అభ్యర్థిగా జైపాల్ యాదవ్‌
  • మనస్తాపానికి గురైన నారాయణరెడ్డి
  • తగిన ప్రాధాన్యతనిస్తామని హామీ
కల్వకుర్తి టికెట్ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి కేటీఆర్ చొరవతో శాంతించారు. కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్‌ను అధిష్ఠానం ప్రకటించింది. దీంతో నారాయణరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల ఓసారి ఆయనతో కేటీఆర్ మాట్లాడినప్పటికీ ఆయన వినలేదు.

అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నారాయణరెడ్డి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఓడిపోడం ఖాయమని భావించిన కేటీఆర్ మరోసారి నారాయణరెడ్డితో భేటి అయ్యారు. పార్టీలో తగిన ప్రాధాన్యత నిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. జైపాల్ యాదవ్‌ను గెలిపించుకుంటామని కేటీఆర్‌కు హామీ ఇవ్వడమే కాదు... కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తి బహిరంగ సభకు వెళ్లారు.
KTR
Narayana Reddy
jaipal Yadav
TRS
Kalvakurthi

More Telugu News