vinayak: ఎన్టీఆర్ బయోపిక్ లో దర్శకుడు వినాయక్

  • దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ 
  • విఠలాచార్య పాత్రలో ఎన్.శంకర్ 
  • దాసరి పాత్రలో వీవీ వినాయక్
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో చంద్రబాబునాయుడిగా రానా .. హరికృష్ణగా కల్యాణ్ రామ్ .. ఏఎన్నార్ గా సుమంత్ .. శ్రీదేవిగా రకుల్ .. జయప్రదగా తమన్నా నటించారు. దర్శకుడు కేవీ రెడ్డిగా క్రిష్ .. విఠలాచార్యగా ఎన్.శంకర్ నటిస్తున్నారు. ఇక దాసరి నారాయణరావు పాత్రలో వీవీ వినాయక్ నటించనున్నాడనేది తాజా సమాచారం.

దాసరి నారాయణరావు .. ఎన్టీ రామారావు కాంబినేషన్లో వచ్చిన 'సర్దార్ పాపారాయుడు' .. 'బొబ్బిలి పులి' .. 'విశ్వరూపం' సంచలన విజయాలను సాధించాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో దాసరి నారాయణరావు పాత్రను చూపించవలసిన అవసరం వుంది. ఈ పాత్రకి గాను వినాయక్ అయితే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించినట్టు తెలుస్తోంది. త్వరలోనే దాసరి పాత్రకి సంబంధించిన సన్నివేశాలను వినాయక్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.      
vinayak

More Telugu News