taman: 100 సినిమాలు పూర్తి చేసేసిన తమన్!

  • గట్టి పోటీని తట్టుకున్న తమన్ 
  • తెలుగు పాటపై తనదైన ముద్ర 
  • యూత్ నుంచి మంచి మార్కులు   
తెలుగు పాటకు కొత్త మెరుపును .. విరుపును నేర్పిన సంగీత దర్శకుడిగా తమన్ కనిపిస్తాడు. మణిశర్మ .. దేవిశ్రీ ప్రసాద్ తమ జోరును కొనసాగిస్తోన్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన తమన్, పాటపై తనదైన ముద్రవేయడానికి తనవంతు తపస్సు చేశాడు. యూత్ ను పట్టుకునే బీట్స్ తో పాటలను హుషారుగా పరుగులు తీయించాడు. తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తూ, చాలా వేగంగా పాటలు చేసి ఇవ్వగలిగిన సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి వెనుదిరిగి చూసుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 100 సినిమాలను పూర్తిచేసేశాడు. 'అరవింద సమేత వీర రాఘవ' ఆయన స్వరపరిచిన 100వ సినిమా. తాను సంగీత దర్శకుడిగా పనిచేసిన 100వ సినిమా భారీ విజయాన్ని సాధించినందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తమన్ చెప్పాడు. మొత్తానికి తమన్ చాలా అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నాడు.   
taman

More Telugu News