Harish Rao: తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపే: హరీష్ రావు

  • కాంగ్రెస్ చంద్రబాబునే నమ్ముకుంది
  • టీఆర్ఎస్ విజయంపై ధీమా
  • కేసీఆర్‌ వైపు న్యాయం, ధర్మం ఉంది
న్యాయం, ధర్మం ఉన్న కేసీఆర్‌ వైపే తెలంగాణ ప్రజలంతా ఉన్నారని మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్‌, అమరావతి నుంచి గల్లీదాకా టీడీపీ  నేతలు, సీపీఐ, టీజేఎస్ కౌరవుల్లా నాలుగువేల మంది జమయ్యారని మహాకూటమిపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంతమంది జమయినా కేసీఆర్‌ వైపు న్యాయం, ధర్మం ఉందని, ప్రజల మద్దతుతో  తమ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడే రాష్ట్రంలో తమను గెలిపిస్తారని కాంగ్రెస్‌ నమ్ముతోందని ఎద్దేవా చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
Harish Rao
TRS

More Telugu News