YSRCP: తమ కుమారుడిని చూపించాలని సిట్‌ను కోరిన శ్రీనివాస్ తల్లిదండ్రులు

  • మూడు రోజులుగా శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు
  • విచారణకు శ్రీనివాస్ సహకరించట్లేదని వెల్లడి
  • శ్రీనివాస్ తల్లిదండ్రులను విశాఖ తీసుకెళ్లిన పోలీసులు
వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసు నిందితుడిని మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. కానీ శ్రీనివాసరావు విచారణకు సహకరించట్లేదని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు శ్రీనివాస్ స్వగ్రామం ఠానేలంకలోనూ సిట్ అధికారుల విచారణ నిర్వహిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులతో పోలీసులు జరిపిన విచారణలో నిందితుడి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఒకసారి చూపించాలని కోరారు. వారి కోరికను మన్నించిన పోలీసు అధికారులు శ్రీనివాస్‌ను చూపించేందుకు విశాఖ తీసుకెళ్లారు.
YSRCP
Jagan
Ganta Srinivasa Rao
Thanelanka

More Telugu News