devegowda: రాహుల్ గాంధీ, చంద్రబాబులపై దేవేగౌడ ప్రశంసలు!

  • మహాకూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు
  • కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం
  • రాహుల్ కు నేను పూర్తి మద్దతు ఇస్తాను
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. బీజేపీని సాగనంపేందుకు విపక్షాలు మహాకూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహాకూటమి ఏర్పాటు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
 
మహాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దేవేగౌడ చెప్పారు. రాహుల్ కు తాను పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. ఇటీవలి కాలంలో రాహుల్ విశేషమైన రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్నారని కితాబిచ్చారు. బళ్లారి పార్లమెంటు ఉపఎన్నిక సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప గెలుపు కోసం జేడీఎస్ కృషి చేస్తుందని చెప్పారు.
devegowda
Chandrababu
Rahul Gandhi
jds
congress
Telugudesam
bjp

More Telugu News