Andhra Pradesh: విశాఖలో కారుతో బీభత్సం సృష్టించిన స్మగ్లర్లు.. ముగ్గురు స్కూలు విద్యార్థులకు తీవ్రగాయాలు!

  • చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాల వద్ద ఘటన 
  • స్కూలులోకి దూసుకెళ్లిన స్మగ్లర్ల కారు
  • కారును వదిలేసి పరారైన దుండగులు
విశాఖపట్నం జిల్లా లో ఓ కారు ఈరోజు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఓ ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు, టీచర్లు పిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

జిల్లాలో చిట్టెంపాడులో ఈ రోజు కొందరు స్మగ్లర్లు గంజాయిని తీసుకుని బయలుదేరారు. అయితే పోలీసులు వీరిని వెంబడించడంతో కారును వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో చిట్టెంపాడు వద్ద కారును రివర్స్ చేస్తుండగా వాహనం అదుపుతప్పి ప్రభుత్వ పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లాసులో కూర్చున్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు, టీచర్లు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం అనంతరం నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని టీచర్లు చెబుతున్నారు.
Andhra Pradesh
Visakhapatnam District
school
rushed
car
crashed
smugllers
three students
accident
Police
canniebee

More Telugu News