paruchuri: 'అరవింద' సక్సెస్ లో వాళ్లకి కూడా వాటా వుంది: పరుచూరి గోపాలకృష్ణ

  • పాత్రలను మలచిన తీరు గొప్పగా వుంది 
  • నరేశ్ చాలా బాగా నవ్వించాడు 
  • రామ్ లక్ష్మణ్ పనితీరు బాగుంది
'అరవింద సమేత' చూసిన పరుచూరి గోపాలకృష్ణ, ఆ సినిమా పట్ల తనకి గల అభిప్రాయాన్ని 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో వ్యక్తం చేశారు. "ఈ సినిమాలో ఈశ్వరీరావు నటన చెప్పుకోదగినదిగా అనిపించింది. నరేశ్ విషయానికొస్తే సునీల్ కంటే ఎక్కువగా నవ్వించాడు .. భవిష్యత్తులో ఈ తరహా పాత్రల కోసం చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలోని ఫైట్స్ ను రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన తీరును అభినందించి తీరవలసిందే. నిజం చెప్పాలంటే ఈ సినిమా విజయంలో వాళ్లకి కూడా వాటా వుంది. అంత అద్భుతంగా యాక్షన్ సీన్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించారు. బలమైన కథాకథనాలతో .. అద్భుతంగా మలిచిన పాత్రలతో .. విభిన్నంగా డిజైన్ చేసిన పోరాట సన్నివేశాలతో సాగే 'అరవింద' సినిమాను హ్యాపీగా చూడొచ్చు" అని తన మనసులోని మాటను చెప్పారు.  
paruchuri
trivikram

More Telugu News