Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్.. జన్మతః పౌరసత్వంపై క్లారిటీ ఇచ్చిన అధ్యక్షుడు
- మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
- ఇకపై జన్మతః పౌరసత్వానికి చెల్లు చీటీ
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికా గడ్డపై పుట్టిన వారికి స్వతహాగా జన్మతః లభించే పౌరసత్వ హక్కు ఇకపై లభించబోదంటూ సంచలన ప్రకటన చేశారు. ఇకపై దేశ పౌరులు కాని వారు, వారి తల్లిదండ్రుల్లానే అదే హోదాలో ఉండాల్సిందేనని తెగేసి చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ట్రంప్ నిర్ణయంతో హెచ్-1బీ వీసాతో అమెరికా వచ్చిన కుటుంబాల్లో కుదుపు మొదలైంది.
సాధారణంగా ఇప్పటి వరకు తల్లిదండ్రులకు పౌరసత్వం లేకపోయినా, అక్కడ పుట్టిన పిల్లలకు స్వతహాగా జన్మతః అమెరికా పౌరసత్వం లభించేది. ఈ ఒక్క కారణంతో చాలామంది ప్రసవ సమయంలో అమెరికాలోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు. అక్కడి ఆసుపత్రుల్లో జన్మించిన చిన్నారులకు అక్కడి రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం జన్మతః పౌరసత్వం లభించేది.
తాజాగా ట్రంప్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. ఇక్కడికొచ్చి పిల్లల్ని కనేసి 85 ఏళ్లపాటు ఇక్కడ సకల సౌకర్యాలు పొందడం అన్నది పూర్తిగా హాస్యస్పదమన్నారు. ఇకపై ఇది అంతం కావాలని, ఇందుకోసం ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడానని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీనికి అడ్డుకట్ట వేయవచ్చని న్యాయనిపుణులు తనతో చెప్పినట్టు తెలిపారు. అయితే, ఆయన నిర్ణయం కోర్టులో ఏమేరకు చెల్లుతుందో వేచి చూడాల్సిందే.