జయ సమాధివద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే మళ్లీ పార్టీలో చేర్చుకుంటాం: అన్నాడీఎంకే
- 18 మంది మాజీ ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే షరతు
- పార్టీ పత్రిక ‘నమదు అమ్మా’లో వ్యాసం ప్రచురితం
- దినకరన్ మినహా అందరికీ పార్టీలోకి అవకాశం
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ ఆ పార్టీ పత్రిక ‘నమదు అమ్మా’లో ఓ వ్యాసం ప్రచురితమైంది. అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్ మినహా మిగతావారందరినీ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమేనని అన్నాడీఎంకే ప్రకటించిన మరుసటి రోజే పత్రికలో ఈ వ్యాసం ప్రచురితమవడం సంచలనం సృష్టించింది.