కేసీఆర్ చేయించింది రాత్రిపూట ‘గ్లాస్’ సర్వే.. నేను చేయించింది మాత్రం గ్రాఫ్ సర్వే!: కాంగ్రెస్ నేత రాములు నాయక్
- అధికారంలోకి వచ్చేది మహాకూటమే
- కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయి
- తెలంగాణ స్టీరింగ్ కాంగ్రెస్ చేతుల్లో
కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో కేటీఆర్ ఊహిస్తున్నట్లు టీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదని రాములు నాయక్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిస్తే చెప్పు నెత్తిన పెట్టుకుంటానని సవాల్ విసిరారు. తాను మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సర్వే చేయించాననీ, ఇక్కడ మహాకూటమి మెజారిటీ సీట్లను దక్కించుకోబోతోందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేయించింది రాత్రిపూట గ్లాస్ సర్వే అనీ, తాను చేయించింది మాత్రం గ్రాఫ్ సర్వే వ్యాఖ్యానించారు.