జగన్ భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదు.. త్వరలోనే పాదయాత్ర మొదలవుతుంది!: బొత్స సత్యనారాయణ
- చంద్రబాబును గద్దె దించే ఆలోచన లేదు
- ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత
- డీజీపీ తీరు అభ్యంతరకరంగా ఉంది
జగన్ పై దాడి జరగగానే నిందితుడిని తొలుత సీఐఎస్ఎఫ్ పట్టుకుని పోలీసులకు అప్పగించిందనీ, అధికారులు సైతం అప్పుడే కేసు నమోదుచేశారని తెలిపారు. కత్తి దాడితో భయపడిపోయి జగన్ ఇంట్లో కూర్చునే రకం కాదనీ, త్వరలోనే కోలుకుని ఆయన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటారని వెల్లడించారు. జగన్ పై దాడి ఘటనలో రాష్ట్ర డీజీపీ తీరు అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరపాలనీ, కుదరకుంటే హైకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.