జగన్ పై దాడి జరిగాక కత్తి 2 గంటలు మాయమైంది.. దీనిపై వైసీపీ నేతలను విచారించాలి!: మంత్రులు సుజన, ప్రత్తిపాటి
- వైసీపీ, బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి
- ఫొటోలు, ప్లెక్సీలు మార్ఫింగ్ చేస్తున్నారు
- చంద్రబాబు, లోకేశ్ లనూ వదలలేదు
మరోవైపు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఫొటోల నుంచి ప్లెక్సీల ద్వారా మార్ఫింగ్ చేసే సంస్కృతికి వైసీపీ తెరలేపిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా టీడీపీ కార్యకర్తలు బయటపెట్టారని వెల్లడించారు. జగన్ తో శ్రీనివాసరావు ఫొటోలు దిగితే, దాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లతో ఫొటోలు దిగినట్లు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు.
అసలు జగన్ పై దాడి జరిగిన 2 గంటల వరకూ కత్తి మాయం కావడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జగన్ తో పాటు ఉన్న వైసీపీ నేతలను విచారించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. పోలీసుల విచారణలో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.