Congress: కాంగ్రెస్ కు కమిట్ మెంట్.. టీడీపీకి సెంటిమెంట్ లేవు!: ఎంపీ కవిత

  • కరప్షన్ కు పుట్టిన కవలలే కాంగ్రెస్, టీడీపీ
  • మహాకూటమికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం
  • కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మళ్లీ ఎలా పోటీ చేస్తారు?  
కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై టీఆర్ఎస్ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు. జగిత్యాలలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, కరప్షన్ కు పుట్టిన కవలలే కాంగ్రెస్, టీడీపీలని విమర్శించారు. కాంగ్రెస్ కు కమిట్ మెంట్.. టీడీపీకి సెంటిమెంట్ లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు ట్రైలర్ మాత్రమే చూశారని, త్రీడీ స్క్రీన్ పై అసలు సినిమా చూపిస్తామని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

గత ఎన్నికల్లో ‘ఇదే ఆఖరిపోటీ’ అన్న కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి, మరి, ఈసారి ఎలా పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. 2006, 2008లో కేసీఆర్ పై జీవన్ రెడ్డి పోటీ చేసేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.
Congress
Telugudesam
TRS
kavitha

More Telugu News