Chandrababu: దాడి ఘటనతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలనుకున్నారు: లంక దినకర్

  • విమానాశ్రయం కేంద్రం పరిధిలో ఉంటుందని తెలియదా?
  • తమ వైఫల్యాలను పక్కనబెట్టుకుని ప్రభుత్వంపై నిందలు
  • వైసీపీ, బీజేపీ నేతల కుట్రలు బహిర్గతమవుతున్నాయి
విమానాశ్రయం కేంద్రం పరిధిలో ఉంటుందని బీజేపీకి తెలియదా?... తమ వైఫల్యాలను పక్కనబెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేయడమేంటని టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం చంద్రబాబుపై బీజేపీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

జగన్‌పై దాడిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నించారని.. వైసీపీ, బీజేపీ నేతల కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గతమవుతున్నాయన్నారు. నిందితుడు శ్రీనివాసరావు ఐడీ అంటూ ఫేక్ ఐడీని చూపించారని దినకర్ విమర్శించారు. రాం మాధవ్‌కు తన ఇంట్లో వారే ఓటేయరని ఎద్దేవా చేశారు.
Chandrababu
Jagan
YSRCP
BJP
Lanka Dinakar
Srinivasa Rao

More Telugu News