kcr: ‘మూడో పెగ్’ అనబోయి ‘మూడో కన్ను’ అన్నట్టుంది!: కేసీఆర్ పై మధుయాష్కీ సెటైర్లు

  • రెండు కళ్లూ కనబడని కేసీఆర్ మూడో కన్ను తెరుస్తాడా!
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అసాధ్యం
  • మహాకూటమి విజయఢంకా మోగిస్తుంది
‘నేను మూడో కన్ను తెరిస్తే..’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీ-కాంగ్రెస్ నేత మధుయాష్కీ సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు కళ్లూ కనబడని ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కన్ను తెరుస్తానని మాట్లాడటం హాస్యాస్పదమని, ‘మూడో పెగ్’ అనబోయి ‘మూడో కన్ను’ అన్నట్టుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

భారతదేశ ఉపరాష్ట్రపతే తన కంటి వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తారని, కేసీఆర్ మాత్రం తన కంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళతారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అసాధ్యమని తెలిసి, కంటి పరీక్షల పేరిట ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కేసీఆర్ కలుస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి విజయఢంకా మోగిస్తుందని దేశంలోని ప్రముఖ సంస్థల సర్వేలు చెబుతున్నాయని అన్నారు.
kcr
Madhu Yaskhi
TRS
congress

More Telugu News