Nara Lokesh: ఢిల్లీలో రాసిన కథ, విశాఖ ఎయిర్ పోర్ట్ లో రక్తి కట్టింది: నారా లోకేశ్

  • ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలని చూశారు
  • కోడి కత్తి వార్త కూయక ముందే ప్రెస్ మీట్లు పెట్టారు
  • కుట్ర రాజకీయం అనడానికి ఈ ఆధారాలు సరిపోవా?
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘ఢిల్లీలో రాసిన కథ, విశాఖ ఎయిర్ పోర్ట్ లో రక్తి కట్టింది. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాల నేతల వరకూ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను కిరాతకంగా చంపిన ఘటన, కొండగట్టు బస్సు ప్రమాదం, తిత్లీ తుపాను సమయంలో కనీసం సానుభూతి తెలపని నాయకులు.. కోడి కత్తి వార్త కూయక ముందే ఢిల్లీ నుండి గల్లీ వరకూ ప్రీ ప్లాన్డ్ ప్రెస్ మీట్లు పెట్టారు. కుట్ర రాజకీయం అనడానికి ఈ ఆధారాలు సరిపోవా?’ అని లోకేశ్ విమర్శించారు.
Nara Lokesh
ys jagan

More Telugu News