Soma Sekhar: భర్తను కాపాడుకునే క్రమంలో భార్య కూడా మృతి!

  • పొలం వద్ద పనిచేస్తున్న సోమశేఖర్, వనిత
  • మూర్ఛ రావడంతో ప్రమాదం
  • భర్తను కాపాడుకోవాలని బావిలో దూకిన వనిత
బావిలో పడిన భర్తను కాపాడుకోవాలన్న తొందరలో తనకు ఈత రాదన్న విషయం కూడా మరచిపోయింది. ఆలోచన లేకుండా బావిలో దూకి భర్తతో పాటే తన ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని కుప్పనపల్లిలో జరిగింది.

గ్రామానికి చెందిన సోమశేఖర్, అతని భార్య వనిత శనివారం సాయంత్రం పొలం వద్ద పని చేస్తున్నారు. ఆ సమయంలో సోమశేఖర్‌కు మూర్ఛ రావడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. దాన్ని గమనించిన వనిత భర్తను కాపాడుకోవాలని బావిలో దూకింది. ఈత రాకపోవడంతో భర్తతో పాటే ఆమె కూడా జల సమాధి అయింది. బైరెడ్డిపల్లి ఎస్సై ఉమా మహేశ్వర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Soma Sekhar
Vanitha
Chittoor District
Kuppanapalli
Uma Maheshwar Reddy

More Telugu News