thati venkateswarly: వైసీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

  • అశ్వారావుపేట తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు చేదు అనుభవం
  • ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న వామపక్ష కార్యకర్తలు
  • టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయావంటూ ధ్వజం
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు వామపక్ష కార్యకర్తల నుంచి నిరసనల సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం కోసం మల్లాయిగూడెం వెళ్లిన ఆయనను వామపక్ష కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, నీవు మాకు ఏమి చేశావంటూ నిలదీశారు. వైసీపీ నుంచి పోటీ చేసి, గెలిచి... టీఆర్ఎస్ కు అమ్ముడుపోయావని మండిపడ్డారు. ఆయన సమాధానం చెప్పేందుకు యత్నించినా వారు వినలేదు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, వామక్ష కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు చేసేదేమీ లేక తాటి వెంకటేశ్వర్లు అక్కడ నుంచి వెనుదిరిగారు.
thati venkateswarly
TRS
ysrcp

More Telugu News