జగన్ సీఎం కావాలనే కోరికతో.. సానుభూతి కోసం ప్రయత్నించారేమో!: బుట్టా రేణుక
- జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం
- పాదయాత్రకు భద్రత పెంచాలి
- వెర్రి అభిమానంతో దాడి చేసి ఉండొచ్చు
తాజాగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జగన్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇకముందు ఆయన పాదయాత్రకు పటిష్టమైన భద్రత చేపట్టాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో సానుభూతి సంపాదించుకోవడం కోసం ప్రయత్నించారేమోననే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. లేదంటే జగన్‌పై వెర్రి అభిమానంతో దాడి చేసి ఉండొచ్చని రేణుక పేర్కొన్నారు.