Twitter: ఉత్తమ్, ఇదేమైనా బాగుందా?: ట్విట్టర్ లో కేటీఆర్

  • పోలీసులపై ఉత్తమ్ కుమార్ విమర్శలు
  • తెలంగాణ పోలీసులు దేశానికే రోల్ మోడల్
  • ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దు
తెలంగాణ పోలీసులు కేవలం కాంగ్రెస్ నేతల వాహనాలనే టార్గెట్ చేస్తున్నారని, కేటీఆర్ బంధువు రాధాకృష్ణరావు తన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కాంగ్రెస్ పైకి ఉసిగొల్పారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ఈ తరహా చౌకబారు విమర్శలు చేయడం ఉత్తమ్ స్థాయికి తగదని అన్నారు. మీ విమర్శలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని కితాబిచ్చిన ఆయన, అనవసర రాజకీయాలు చేస్తూ, పోలీసుల శ్రమను కించపరచవద్దని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని సూచించారు.
Twitter
KTR
Telangana
Uttam Kumar Reddy
Police

More Telugu News