kishan reddy: ముస్లిం రిజర్వేషన్ల రద్దుపైనే తొలి సంతకం: కిషన్ రెడ్డి

  • విద్య, ఉద్యోగాల్లో కల్పించే రిజర్వేషన్లను రద్దు చేస్తాం
  • రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు రద్దుపైనే తొలి సంతకం చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. 
kishan reddy
bjp
muslim
reservations
kcrt
TRS

More Telugu News