Miryalaguda: మారుతీరావుకు బెయిల్ ఇవ్వద్దని న్యాయమూర్తిని వేడుకున్న అమృత... సరేనన్న జడ్జి!

  • సంచలనం సృష్టించిన పరువు హత్య
  • నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాల తారుమారు
  • తనను చంపేస్తారేమోనని కోర్టుకు తెలిపిన అమృత
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు బెయిల్ ను న్యాయమూర్తి నిరాకరించారు. బెయిల్ పై వాదనల సందర్భంగా కోర్టు హాల్ లో ఆసక్తికర ఘటనలు జరిగాయి. ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టుకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ మోకిని సత్యనారాయణగౌడ్‌ వాదనలు వినిపించారు.

అదే సమయంలో అమృత వర్షిణి తరఫున హుస్సైబ్ హైమద్ వాదిస్తూ, ఈ కేసులో నిందితులకు బెయిల్ లభిస్తే, సాక్ష్యాలు తారుమారవుతాయని, తనకు ప్రాణహాని కల్పించే అవకాశం ఉందని అమృత తరఫున విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇవ్వరాదని తన క్లయింట్ వేడుకుంటున్నారని తెలిపారు. దీంతో ఏ1 మారుతీరావు సహా నిందితులందరికీ బెయిల్ ను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.
Miryalaguda
Amrutha
Pranay
Murder
Marutirao
Bail

More Telugu News