eesha rebba: ఎందుకండీ, ఈ కలర్ పిచ్చి?: అభిమానికి హీరోయిన్ ఈషా రెబ్బా కౌంటర్

  • ఇన్నాళ్లూ చిన్న సినిమాలలో నటించిన ఈషా  
  • 'అరవింద'లో దక్కిన పెద్ద ఛాన్స్ 
  • త్వరలో రానున్న 'సుబ్రహ్మణ్యపురం'
చిన్న సినిమాలలో కథానాయికగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తోన్న ఈషా రెబ్బా, 'అరవింద' వంటి పెద్ద సినిమాలో కథానాయికగా మెరిసింది. మరింత క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా, ఆమె మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె సోషల్ మీడియాలో సరదాగా అభిమానులతో ముచ్చటించింది.

ఈ సమయంలోనే 'మీరు ఇంకొంచెం కలర్ వుంటే తిరుగుండేది కాదు' అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. అందుకు ఆమె స్పందిస్తూ .. 'ఎందుకండీ ఈ కలర్ పిచ్చీ .. నాకు వున్న కలర్ తో నేను చాలా సంతోషంగా వున్నాను. హీరోలు ఎలా వున్నా ఫరవాలేదు గానీ, హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండగా వుంటే మీకు ఇష్టమా ?' అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈషా రెబ్బా తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సుబ్రహ్మణ్యపురం' సిద్ధమవుతోంది.
eesha rebba

More Telugu News