ఇండిగో దీపావళి ఆఫర్: రూ.899కే విమాన టికెట్... 64 గమ్య స్థానాలకు!
- 24-26 మధ్య టికెట్లను బుక్ చేసుకోవచ్చు
- ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లు
- 64 గమ్య స్థానాలకు ఆఫర్ వర్తింపు
ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను కేటాయించినట్టు ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి మాట్లాడుతూ.. ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరకే టికెట్ అందజేస్తున్నామన్నారు. ఇండిగో ప్రయాణించే 64 గమ్య స్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని.. ఎయిర్ పోర్ట్ చార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండబోదన్నారు. అయితే ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లు రద్దు చేసుకుంటే డబ్బు తిరిగి రాదు.