గుంటూరు జిల్లా అధికారుల రికార్డు.. ఒకే రోజు 50 వేల మంది ఓటర్ల నమోదు!
- 560 కాలేజీల్లో ఓటర్ల నమోదు
- అద్భుతంగా సహకరించారన్న కలెక్టర్ శశిథర్
- పరేడ్ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం
తాజాగా 50 వేల మంది ఓటర్ల నమోదుకు కాలేజీలు, విద్యార్థులు అధికారులకు అద్భుతంగా సహకరించారని తెలిపారు. పలువురు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. ఓటర్ల నమోదు విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.