Titli Cyclone: తిత్లీ తుపాను బాధితులకు సచివాలయ ఉద్యోగులు రూ.25 లక్షల విరాళం

  • తిత్లీ తుపానుతో దారుణంగా దెబ్బతిన్న సిక్కోలు
  • ఆదుకోవాలంటూ కేంద్రానికి సీఎం లేఖ
  • ముందుకొచ్చిన సచివాలయ ఉద్యోగులు
తిత్లీ తుపానుతో వణికిపోయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ముందుకొచ్చారు. తుపాను బాధితుల కోసం తమ వంతుగా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సచివాలయంలోని మొత్తం 1500 మంది ఉద్యోగులు కలిసి రూ.25 లక్షల సాయాన్ని అందించనున్నట్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.

తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా దారుణంగా దెబ్బతింది. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీంతో, తమను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తక్షణ సాయం ప్రకటించాలని, జాతీయ విపత్తుగా గుర్తించాలని అందులో కోరారు. అలాగే, రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Titli Cyclone
Srikakulam District
Chandrababu
AP secretariat

More Telugu News