Chandrababu: తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు.. తమ్ముళ్లలో పుల్ జోష్!

  • ప్రచారానికి రావాల్సిందిగా కోరిన నేతలు
  • సరేనన్న చంద్రబాబు
  • మహాకూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడంతో తెలుగు తుమ్ముళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రకటనపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రచారంతో మహాకూటమి విజయావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం పలువురు నేతలు చంద్రబాబును కలుసుకుని తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని సీట్లు.. ఏ సీటు, ఏ అభ్యర్థి అనే మూడు దశల్లో జరుగుతుందని స్పష్టం చేశారు.
Chandrababu
Telangana
Telugudesam
Election
campaign

More Telugu News