వెనక్కి తగ్గేది లేదు.. సాధికార మిత్రలపై మళ్లీ రివ్యూ పిటిషన్ వేస్తా!: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
- ఏపీ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది
- రూ.1.000 కోట్ల దోపిడీకి చంద్రబాబు కుట్ర
- పిటిషన్ కొట్టివేతపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత సన్నిహితం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది మహిళలను ‘సాధికార మిత్ర’లుగా ఏపీ ప్రభుత్వం 2017లో నియమించింది. దాదాపు 35 కుటుంబాలకు ఓ సాధికార మిత్ర చొప్పున 4 లక్షల మంది మహిళలతో ఓ సేవాదళాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పథకాల అమలులో లోటుపాట్లను టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారులకు వీరు చేరవేయాల్సి ఉంటుంది.
దీంతో ఈ నియామకాలను సరైన పద్దతిలో చేపట్టలేదనీ, వీటిని వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆర్కే పిటిషన్ లో విచారించదగ్గ అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది.