Chiranjeevi: చిరంజీవి కుటుంబంలో పవన్ శక్తిమంతుడు: చదలవాడ

  • టీడీపీ నన్ను ఒక్క రోజు కూడా గుర్తించలేదు
  • టికెట్ కోసం జనసేనలో చేరలేదు
  • స్వార్థం కోసం చిన్న తప్పు కూడా చేయలేదు
తనకు పదవుల మీద మోజు లేదని, ధర్మం ఎక్కడుంటే అక్కడుంటానని జనసేన నేత చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. టికెట్ కోసం తాను జనసేనలో చేరలేదని చెప్పారు. టీటీడీ బోర్డు మెంబర్ కావాలని కోరుకున్నానని... కానీ, వెంకన్న దయతో బోర్డు ఛైర్మన్ అయ్యానని తెలిపారు. స్వార్థం కోసం తాను చిన్న తప్పు కూడా చేయలేదని... టీడీపీకి వన్నె తెచ్చానని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును జీవితాంతం మర్చిపోనని అన్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ తనను ఒక్కరోజు కూడా గుర్తించలేదని... దీంతో, విసిగిపోయి పార్టీ మారానని చెప్పారు. చిరంజీవి సినిమాల ద్వారా కావాల్సినంత డబ్బు సంపాదించానని తెలిపారు. చిరంజీవి కుటుంబంలో పవన్ కల్యాణే శక్తిమంతుడని... అందుకే ఆయన పార్టీలో చేరానని చెప్పారు.


Chiranjeevi
Pawan Kalyan
chadalavada
janasena
Telugudesam

More Telugu News