kcr: 105 మంది అభ్యర్థులు, ఎంపీలతో సమావేశమైన కేసీఆర్

  • ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచారంపై ఆరా
  • ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం
  • పాక్షిక మేనిఫెస్టోపై అవగాహన
ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో పాటు, పార్టీ ఎంపీలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రచారం జరిగిన తీరును కేసీఆర్ తెలుసుకుంటున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో ఎలా సమన్వయం కావాలి? ప్రజల మద్దతును పొందేందుకు ఏం చేయాలి? అనే విషయాలను ఆయన వివరించనున్నారు. పార్టీ అభ్యర్థులు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో తెలియజేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, పాక్షిక మేనిఫెస్టోపై అభ్యర్థులకు అవగాహన కలిగించనున్నారు. 
kcr
TRS
mla
mp

More Telugu News