నందమూరి ఫ్యాన్స్ కు పండగే.. కలసి సందడి చేయనున్న బాలయ్య, తారక్!
- రేపు హైదరాబాదులో 'అరవింద సమేత' విజయోత్సవ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బాలయ్య
- ఆనందంలో మునిగితేలుతున్న నందమూరి ఫ్యాన్స్
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకు వస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త తెలియగానే నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. గతంలో బాలయ్య సినిమా 'సింహా'కు సంబంధించిన కార్యక్రమానికి తారక్ వచ్చిన సంగతి తెలిసిందే.