కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టార్గెట్ గా అభ్యంతరకర వీడియోలు.. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు!
- కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కృష్ణారావుకు వేధింపులు
- పోలీసులను ఆశ్రయించిన నేత
- నిందితుడిని కటకటాల వెనక్కునెట్టిన పోలీసులు
మాధవరం కృష్ణారావును కించపరిచేలా హైదరాబాద్ లోని ప్రశాంతినగర్ కు చెందిన వ్యాపారి పొట్లూరు రమేశ్ బాబు వీడియోలు రూపొందించాడు. అనంతరం వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు చివరికి మాధవరం కృష్ణారావు దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయన కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారి రమేశ్ బాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది.