guntur: గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత!

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ 289వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ఈ రోజు బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రారంభమైంది. ఇందిరమ్మ కాలనీ, పోలవాని వలస, మెట్ట వలస, భోజరాజపురం క్రాస్‌, సీతారాంపురం మీదుగా పారాది వరకూ జగన్ పాదయాత్ర సాగనుంది. కాగా, యాత్ర సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరి పేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య సహా పలువురు జిల్లా నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే వైసీపీలో చేరినట్లు శివన్నారాయణ, శివయ్య తెలిపారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. 
Go Back to Shorts
guntur
Andhra Pradesh
YSRCP
Jagan

More Telugu News