సీఎం రమేష్ ను చంద్రబాబు వెంటనే తప్పించాలి: నిప్పులు చెరిగిన జీవీఎల్

  • రూ. 100 కోట్లను దారి మళ్లించారు
  • సొంత కంపెనీల్లోనే తప్పుడు లెక్కలు చూపించారు
  • పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఆయనపై ఫిర్యాదు చేస్తా
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. సీఎం రమేష్ తన సొంత కంపెనీల్లోనే తప్పుడు లెక్కలు చూపించారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో... పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీలో ఉన్న రమేష్ దేశానికి సంబంధించి ఏం లెక్కలు చూస్తారని మండిపడ్డారు. రూ. 100 కోట్లను రమేష్ దారి మళ్లించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని పీఏసీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తప్పించాలని కోరారు. సీఎం రమేష్ ను తప్పిస్తే... మళ్లీ ఆ సీటు టీడీపీకే దక్కుతుందని చెప్పారు. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే... పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి రమేష్ మీద తానే ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రమేష్ లాంటి వ్యక్తి పీఏసీలో ఉండటం దారుణమని అన్నారు.
Go Back to Shorts
dm ramesh
gvl narasimha rao
bjp
Telugudesam

More Telugu News