ఫెమా నిబంధనల అతిక్రమణ.. ఎన్డీటీవీకి నోటీసులు జారీ చేసిన ఈడీ
- ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో రూ. 2,732 కోట్ల పెట్టుబడులు
- రూ. 1,637 కోట్ల విదేశీ పెట్టుబడుల స్వీకరణ
- లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించాం
రూ. 725 కోట్లను ఎఫ్డీఐ రూపంలో సీసీఈఏ అనుమతులు లేకుండా ఎన్డీటీవీ అందుకుందని ఆరోపించింది. రూ. 600 కోట్లకు మించితే ఎఫ్డీఐకు సీసీఈఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఈ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని ఎన్డీటీవీ చేసిందని ఈడీ తెలిపింది. లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించామని... ఫెమా కింద పలు కంపెనీలతో పాటు పలువురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని వెల్లడించింది.