Rahul Gandhi: రాహుల్ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

  • ఈ నెల 20న హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ
  • చార్మినార్ వద్ద సద్భావన యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్ అధినేత
  • రోశయ్యకు సద్భావన అవార్డును అందజేయనున్న రాహుల్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 20న హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. చార్మినార్ వద్ద నిర్వహించే సద్భావన యాత్రలో ఉదయం కాకుండా ఆయన సాయంత్రం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు ఆయన మహారాష్ట్రలోని నాందేడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా భైంసా వెళ్లి, ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకుంటారు. 3.30 నుంచి 4.40 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.

రహదారి మార్గంలో సాయంత్రం 6 గంటలకు చార్మినార్ వద్దకు రాహుల్ చేరుకుంటారు. అక్కడ జరిగే సద్భావన యాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏపీ మాజీ సీఎం రోశయ్యకు సద్భావన అవార్డును అందిస్తారు. అనంతరం రాత్రి 7.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు.     
Rahul Gandhi
hyderabad
sadbhavana yatra
rosaiah

More Telugu News